Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

|

Mar 11, 2022 | 9:33 AM

Model Offer in Russia Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యన్ సేనలను ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్నారు. బాంబుల వర్షం కురిపిస్తున్నారు.జరిగిన నష్టం చాలు.. ఇక యుద్ధాన్ని ఆపేయండని కోరుకుంటున్నారు. అయితే, తాజాగా రష్యాకు చెందిన ఓ మోడల్ సంచలన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అనే చెప్పాలి.


కొద్దీరోజులుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యన్ సేనలను ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్నారు. బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను టార్గె్ట్‌గా చేసుకుని ముప్పేటా దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా స్వదేశంలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులను ఆపేయాలంటూ రష్యాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాస్కోలోని ప్రధాన వీధుల్లోకి వచ్చి.. ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. తమ దేశ అధ్యక్షుడు తీరును తప్పు పడుతున్నారు. మరోవైపు ఈ నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు అక్కడి పోలీసులు. ఇలా ఇంటా భయటా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్‌కేర్ అంటున్నారు. దేశ రక్షణే తన లక్ష్యమని, ఉక్రెయిన్‌పై తగ్గేదే లేదంటున్నారు.

ఇదిలాఉంటే.. రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. అక్కడి పరిస్థితులు మరింత హృదయవిదారకంగా ఉన్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాంతో అక్కడి పరిస్థితులు చూసి యావత్ ప్రపంచం సానుభూతి వ్యక్తం చేస్తోంది. జరిగిన నష్టం చాలు.. ఇక యుద్ధాన్ని ఆపేయండని కోరుకుంటున్నారు. అయితే, తాజాగా రష్యాకు చెందిన ఓ మోడల్ సంచలన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అనే చెప్పాలి.రష్యా సైనికులు తమ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఆదేశాలను పాటించకుండా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేయకుండా ఉండే సైనికులతో తాను డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది రష్యా మోడల్ లిల్లీ సమ్మర్స్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలుస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా.. ఆ ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఉక్రెయిన్‌పై ద్వేషం, ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి రష్యన్ సైనికుడితో నేను మింగిల్ అవడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ పేర్కొంది. ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి ప్రకటన ఇచ్చింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆదేశ జెండాను పట్టుకుని అనేక ఫోటోలను పంచుకుంది. శాంతి శాంతి అంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి ప్రకటన చేసింది ఈ రష్యన్ మోడల్.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Follow us on