హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్..
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై జలమండలి కీలక సూచనలు చేసింది. ఉస్మాన్ సాగర్ కాండ్యూట్‌లోని లీకేజీల మరమ్మతుల కారణంగా నవంబర్ 3, 4 తేదీల్లో సబ్జా కాలనీ, టోలీచౌకి, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని, పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల సామర్థ్యం గల, వందేళ్లకు పైగా పురాతనమైన రాతి నిర్మాణ కాండ్యూట్‌పై లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు సబ్జా కాలనీ, టోలీచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద జలమండలి అత్యవసర మరమ్మతు పనులు చేపడుతోంది.ఈ మరమ్మతు పనులు నవంబర్ మూడో తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ నాలుగో తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్నాయి. ఈ పాక్షిక అంతరాయం కేవలం గండిపేట కాండ్యూట్ కు మాత్రమే పరిమితం. గోషామహల్, కార్వాన్ సర్కిల్‌లోని రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకి ఖబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ ప్రాంతాలతో పాటు గోల్కొండ జోన్‌లోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్ నగర్, అహ్మద్ నగర్ ప్రాంతాలు, దోమలగూడ, కవాడిగూడ, గాంధీనగర్ వార్డు పరిధి, బంజారా హిల్స్ మరియు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయబడింది.
మరిన్ని వీడియోల కోసం :