వ్యర్థం కాదు.. సంపద GWMC వినూత్న ప్రయోగం!

Updated on: Oct 24, 2026 | 7:05 PM

బతుకమ్మ పండుగ తర్వాత పేరుకుపోయిన పూల వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తూ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదర్శంగా నిలుస్తోంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట పరిధిలో సుమారు 60 టన్నుల పూల వ్యర్థాలు పేరుకుపోగా, ఇప్పటివరకు 40 టన్నుల వరకు సేకరించినట్లు సమాచారం. ప్లాస్టిక్‌, దారాలను వేరు చేసి కంపోస్ట్‌గా మార్చుతున్నారు. ఈ ఎరువును హరితహారం మొక్కల పెంపకానికి, రైతులకు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

“చెత్త అనుకుంటే వ్యర్థం.. సద్వినియోగం చేసుకుంటే అదో గొప్ప సంపద” అని నిరూపిస్తున్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు. బతుకమ్మ పండుగ సందర్భంగా నగరంలో వాడి పారేసిన టన్నుల కొద్దీ పూల వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మ నవరాత్రులలో బంతి, చామంతి, గునుగు, తంగేడు, తామర వంటి రకరకాల పూలతో వేడుకలు జరిగాయి. పండుగ అనంతరం వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని మైదానాలు, చెరువులు మరియు గుండాల్లో సుమారు 60 టన్నుల పూల వ్యర్థాలు పేరుకుపోయాయి. సాధారణంగా వీటిని వదిలేస్తే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని గుర్తించిన శానిటేషన్ సిబ్బంది, ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల పూల వ్యర్థాలను సేకరించి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. వరంగల్ నగరంలోని ఆరు కేంద్రాల్లో ఈ పూల వ్యర్థాలతో పాటు దేవాలయాలు, పూల దుకాణాల నుంచి వచ్చిన చెత్తను కూడా డంప్ చేస్తున్నారు. ముందుగా వాటిలోని ప్లాస్టిక్ కవర్లు, దారాలు, రిబ్బన్లను వేరుచేసి.. మూడు దశల్లో నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ఈ విధంగా తయారు చేసిన బయో కంపోస్ట్‌ను నగరంలోని హరితహారం మొక్కల పెంపకానికి, ప్లాంటేషన్‌కు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, కోరిన రైతులకు కూడా ఈ సేంద్రియ ఎరువును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూమి సారాన్ని పెంచేలాGWMC చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని నగర ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఎంతగానో అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. భర్త హగ్‌ చేసుకోగానే కుప్పకూలిన మహిళ

కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్ ! పాస్‌వర్డ్స్ మార్చుకోవాలని నిపుణుల సూచన

2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ

యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని.. ఏంచేశారో చూడండి!

Loading...
Unable to load recommendations.
Follow Us