APSRTC గుడ్ న్యూస్.. విశాఖ To భోగాపురం.. కొత్తగా నెలవారీ పాస్‌లు
విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సుల్లో నెలవారీ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. 10 రోజుల ప్రయాణ ఛార్జీ చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశం కల్పించారు. బోర్డింగ్ పాయింట్‌ను బట్టి పాస్ ధరలు రూ.1,000 నుంచి రూ.7,000 వరకు ఉన్నాయి. విమానాశ్రయ ఉద్యోగులు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
విశాఖపట్న నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఉద్యోగులకు, ప్రయాణికులకు ముఖ్యగమనిక. ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ఏరో ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సుల్లో నెలవారీ పాసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సుల్లో 10 రోజుల ఛార్జీలు చెల్లించి 30 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ఈ బస్ పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతయ విమానాశ్రయానికి ఏపీఎస్ఆర్టీసీ ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతోంది. తాజాగా ఈ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో నెలవారీ పాసుల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ 10 రోజుల ప్రయాణ ఛార్జీతో 30 రోజుల పాటూ ప్రయాణం చేసేలా ఈ పాస్‌లను ప్రారంభించింది. పాత గాజువాక నుంచి హైవే మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రోజూ 10 ఎక్స్‌ప్రెస్ బస్సులు పాత గాజువాక నుంచి బీచ్‌రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లకు మరో 10 బస్సులు అందుబాటులో ఉన్నాయి. బస్సుల సమయాలు, లైవ్ ట్రాకింగ్ కోసం ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ వినియోగించుకోవాలని సూచించారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, భోగాపురం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అరైవల్ బ్లాక్‌లోని కౌంటర్ దగ్గర నెలవారీ సీజన్ పాస్‌లను తీసుకోవచ్చని ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ప్రతి నెలా 10, 11, 12 తేదీలలో ఈ కౌంటర్ అందుబాటులో ఉంటుందని.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో మాత్రమే కాదు విశాఖపట్నంలో ఉన్న బస్ స్టేషన్లలో కూడా నెలవారీ పాస్‌లను పొందవచ్చన్నారు. ఆర్టీసీ 10 రోజుల ప్రయాణ ఛార్జీతో 30 రోజుల పాటూ ప్రయాణించేలా అందిస్తున్న ఈ రాయితీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుస్తోందని.. బోర్డింగ్ పాయింట్‌ను బట్టి నెలవారీ పాస్ ఛార్జీలు ఉంటాయన్నారు. జనరల్ పాస్ ధర రూ. 7,000 ఫిక్స్ చేశారు. గురుద్వారా నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పాస్ ధర రూ. 6వేలు.. ఐటీ హిల్స్ జంక్షన్, జూపార్క్-ఎయిర్పోర్ట్-రూ.5వేలుగా నిర్ణయించారు. మారికవలస నుంచి ఎయిర్‌పోర్ట్‌కు పాస్ రూ.4వేలు.. ఆనందపురం-ఎయిర్‌పోర్ట్‌కు రూ.3వేలు.. తగరపువలస-ఎయిర్‌పోర్ట్‌కు రూ.2వేలు.. ఎయిర్పోర్ట్ జంక్షన్-ఎయిర్‌పోర్ట్‌కు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈ నెలవారీ బస్‌పాస్ సౌకర్యంతో ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా.. ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆర్టీసీ నెలవారీ పాస్‌లకు ప్రయాణికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!