Woman Singing: పాటతో చంపేస్తున్న యువతి.. చెవులు నొప్పులొచ్చేశాయంటున్న బిగ్‌బి.. ఫన్నీ వీడియో
సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని ఓ నానుడి. నిజమే మరి.. మ్యూజిక్ అంటే తెలియని వారు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. అయితే పాటలు అందంగా పాడటం అందరి వల్లా కాదు.
సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని ఓ నానుడి. నిజమే మరి.. మ్యూజిక్ అంటే తెలియని వారు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు. అయితే పాటలు అందంగా పాడటం అందరి వల్లా కాదు. కానీ కొందరు మాత్రం తమకు పాడాలని ఉంటే పాడేస్తుంటారు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారో అని అస్సలు పట్టించుకోరు. తమకు నచ్చిన విధంగా రాగాలు తీసేస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువతి సూపర్ హిట్ మూవీ క్రిష్ నుంచి ‘ఆవో సునావూన్ ప్యార్ కి ఏక్ కహానీ’ పాటను పాడుతూ ఉంది. కానీ ఆమె దానిని చాలా పేలవంగా పాడింది. అది విన్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. ‘అమితాబ్ బచ్చన్’కి కూడా ఈ పాట విని చెవులు నొప్పులొచ్చేసాయట. ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో స్కూల్‌వాలాపయార్ అనే ఐడితో షేర్ చేశారు. యే క్యా సన్ లియా అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 65 వేలమందికి పైగా వీక్షించగా, 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. తమ అభిప్రాయాలను ఫన్నీ కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!
TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!