Women Thief: ఐరన్‌ స్టోర్‌లో కిలాడీ లేడీ దొంగతనానికి విఫలయత్నం.. రంపాన్ని ప్యాంట్‌లో దోపుకుంది..!(వీడియో)

|

Nov 15, 2021 | 8:41 AM

ఈ రోజుల్లో దొంగేవరో దొరలేవరో..అంతుచిక్కటం లేదు..ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా ఓ లేడీ టిప్‌టాప్‌గా తయారై దర్జాగా షాపింగ్‌కు వొచ్చింది..ఐరన్‌ వస్తువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోర్‌లోకి ప్రవేశించిన ఆమే...


ఈ రోజుల్లో దొంగేవరో దొరలేవరో..అంతుచిక్కటం లేదు..ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా ఓ లేడీ టిప్‌టాప్‌గా తయారై దర్జాగా షాపింగ్‌కు వొచ్చింది..ఐరన్‌ వస్తువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోర్‌లోకి ప్రవేశించిన ఆమే…అక్కడ ఒక ఎలక్ట్రిక్‌ రంపాన్ని దొంగలించే ప్రయత్నం చేసింది..ముందుగా తన చుట్టుపక్కల కస్టమర్లు ఉన్నారో లేదో చూసుకుంది. ఎవరూ లేరని గ్రహించింది. కానీ, షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం మర్చిపోయినట్టుంది..దాంతో… ఓ పెద్ద చైన్ సాని తీసి… తన ప్యాంట్‌లో దోపుకోవాలని చూసింది. కానీ అది పట్టలేదు. అంత పెద్దది ఎలా పడుతుంది.అందుకని, ఆమె మరో ఎత్తుగడ వేసింది. తాను మోస్తున్న రెండు బ్యాగుల్ని తీసి పక్కన పెట్టింది. తర్వాత… ఎలక్ట్రిక్ రంపాన్ని… ప్యాంట్స్ వెనక భాగంగా కుక్కింది. అక్కడ కూడా అది సగమే పట్టింది. దాంతో… మిగతా సగాన్ని తన టాప్ డ్రెస్, తన బ్యాగులతో కవర్ చేసింది. ఇక తనను కనిపెట్టలేరు అనుకుంది. అక్కడి నుంచి బయలుదేరింది. కానీ ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది..దీనికీ సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు “ఆమె ఈ వస్తువును దాచిపెట్టగలనా లేదా అని చూస్తోంది” అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 08:20 AM