రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ ఏం చేశాడో తెలుసా !!
ఓ మహిళ రద్దీగా ఉండే లోకల్ ట్రైన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ట్రైన్ అయితే ఎక్కగలిగింది కానీ.. లోపలికి వెళ్లలేకపోయింది. దాంతో డోర్ వద్దే నిల్చుండిపోయింది.
ఓ మహిళ రద్దీగా ఉండే లోకల్ ట్రైన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ట్రైన్ అయితే ఎక్కగలిగింది కానీ.. లోపలికి వెళ్లలేకపోయింది. దాంతో డోర్ వద్దే నిల్చుండిపోయింది. దాంతో ట్రైన్ తలపులు మూసుకోలేదు. అయితే అక్కడున్న వారంతా ఆమెను డోర్‌కి అడ్డంగా తప్పుకోవాలని సూచించారు. అయితే రైలు లోపల కాలు పెట్టేందుకు కూడా చోటు లేకపోవడంతో ఆమె కదలలేకపోయింది. విషయాన్ని గమనించిన లోకో పైలట్ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను సముదాయించి, రైలు దిగేలా చేశాడు. అనంతరం ఎవరూ ఊహించని విధంగా ఇంజిన్ క్యాబిన్ లో తాము విధులు నిర్వర్తించే ప్రదేశంలో ఆమెను కూర్చోబెట్టారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వందల్లో లైక్ చేస్తూ.. ‘ఆమె ఒక మహిళ కాబట్టి ఆమెను గౌరవించాలి’ అని, ‘లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెడ్‌మిల్‌పై స్టన్నింగ్ స్టెప్స్.. హాయ్ రామా అంటూ..
ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్.. ఎక్కడో తెలుసా ??
గ్రాండ్ గా పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ !! 350 మందికి పార్టీ.. గిఫ్ట్ గా గోల్డ్ లాకెట్స్