స్టైల్‌గా బైక్ ఎక్కాలనుకుంది.. కట్ చేస్తే.. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజనం

|

Apr 29, 2023 | 9:43 AM

సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ లైకులు, వ్యూస్ కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో బైక్‌పైన చేసే స్టంట్స్‌ చాలానే ఉంటాయి. యువకులే కాదు యువతులు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు.

సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ లైకులు, వ్యూస్ కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో బైక్‌పైన చేసే స్టంట్స్‌ చాలానే ఉంటాయి. యువకులే కాదు యువతులు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు. అలా ఓ యువతి బైక్‌పైన స్టయిల్‌గా ఎక్కి కూర్చోవాలనుకుంది. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రస్‌లో హై హీల్‌ చెప్పులతో అంతే స్టయిల్‌గా బైక్ వద్దకు వచ్చింది. స్టైలిష్ స్పోర్ట్స్‌ బైక్‌పై స్టంట్ చేసేందుకు సిద్దమైంది. స్టాండ్ వేసి ఉన్న బైకు పైకి స్టైల్‌గా కాలు పైకి లేపి, బైకుపై కూర్చోవాలని ప్రయత్నించింది. ఆ బైక్ ఎత్తుగా ఉండటంతో.. కాలు ఫ్యూయల్ ట్యాంక్‌కు తగిలి ధమాల్ అని కింద పడిపోయింది. చుట్టూ ఎవరూ లేరు కదా అని ఓసారి పరికించి.. కుయ్యో మొర్రో అంటూ కాలు నొప్పితో కాసేపటికి పైకి లేచింది. మొత్తానికి ఈ వీడియో చేరాల్సినచోటికి చేరింది. నెటిజన్లు ఊరుకుంటారా మరి.. లక్షలమంది వీక్షిస్తూ ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎగురుతున్న విమానంలో భారీ శబ్ధాలు.. ఆ తర్వాత ??

అమ్మకానికో ఐల్యాండ్.. ధర తెలిస్తే.. మీరూ కొంటారు

వైభవంగా లేగ దూడకు బారసాల !! చూస్తే ఫిదా కావాల్సిందే !!

బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు

లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

 

Published on: Apr 29, 2023 09:43 AM