Woman Stomach Pain: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి డాక్టర్లు షాక్‌..!

Updated on: Aug 04, 2022 | 12:05 PM

ఇండోర్‌కు చెందిన ఓ 46 ఏళ్ల మహిళ నెల రోజులుగా విపరీతమైన కడుపునొప్పి వాంతులతో బాధపడుతోంది. స్థానిక వైద్యుల వద్ద వైద్యం చేయించుకొని మందులు వాడుతోంది. అయినా


ఇండోర్‌కు చెందిన ఓ 46 ఏళ్ల మహిళ నెల రోజులుగా విపరీతమైన కడుపునొప్పి వాంతులతో బాధపడుతోంది. స్థానిక వైద్యుల వద్ద వైద్యం చేయించుకొని మందులు వాడుతోంది. అయినా నొప్పి తగ్గలేదు సరికదా రోజురోజుకీ మరింత పెరుగుతోంది. దీంతో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకోగా.. ఆ మహిళకు స్కానింగ్‌ చేసిన వైద్యులు షాక్‌ తిన్నారు. ఆమె కడుపులో హెయిర్‌ పిన్‌ ఉన్నట్టు తేల్చారు. అంతేకాదు ఆ పిన్‌ కారణంగా కడుపులో అనేకచోట్ల గాయాలు కూడా అయినట్లు గుర్తించారు. మహిళకు ఎండోస్కోపీ సర్జరీ చేసి ఆమె కడుపులోని హెయిర్ పిన్‌ను తొలగించారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉందని, ఆమెకు ద్రవాహారం మాత్రమే ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కడుపులోని గాయాలు తగ్గిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అయితే మందులతో పాటు హెయిర్ పిన్‌ను కూడా మింగేసి ఉంటానని ఆ మహిళ చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 04, 2022 09:30 AM
Loading...
Unable to load recommendations.
Follow Us