నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో బీభత్సం సృష్టించిన మహిళ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Updated on: Apr 02, 2025 | 4:21 PM

ఇటీవల విమానాశ్రయాలు.. విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొంత దూరం ప్రయాణించాక విమానాలు వెనక్కి తిరిగి రావడం.. ఒకే రన్‌వేపైకి ఒకే సమయంలో రెండు విమానాలు రావడం.. విమానాల్లో ప్రయాణికులు వింతగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం లాంటి ఘటనలూ తరచూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే టెక్సాస్‌లో జరిగింది.

టెక్సాస్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఒంటిపై నూలుపోగు లేకుండా వింత‌గా ప్రవ‌ర్తిస్తూ బీభ‌త్సం సృష్టించింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయ‌త్నించిన ఓ వ్యక్తిని కొర‌క‌డంతో పాటు ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బందిని పెన్సిల్‌తో పొడుస్తూ గాయపరిచింది. మార్చి 14న సమంతా పాల్మా అనే మహిళ ఇలా విమానాశ్రయంలో త‌న వింత ప్రవ‌ర్తన‌తో అంద‌రినీ ప‌రుగులు పెట్టించింది. అంతేకాదు, ఆమె సెక్యూరిటీ గార్డులపై అరుస్తూ, తిట్టడం కనిపించింది. గాలిలోకి నీళ్లు చల్లుతూ డాన్స్‌ చేస్తూ నానా హంగామా చేసింది. తనను తాను ‘వీనస్ దేవత’గా చెప్పుకున్న పాల్మా… విమానాశ్రయంలో ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన‌ ఒక రెస్టారెంట్ మేనేజర్‌ను పెన్సిల్‌తో తల, ముఖంపై పొడిచింది. దాంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ

పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ

పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు

విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో

ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే