Couple Weird Photoshoot: మొగుడ్ని పెంపుడు కుక్కను చేసిన మహిళ..! భర్త మెడలో గొలుసు కట్టి మరీ తిప్పింది గా.. (వీడియో)

Updated on: Nov 15, 2021 | 9:08 AM

ప్రపంచం నలుమూలల జరిగే వింతలు-విశేషాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది... ఓ భార్య తన భర్త మెడలో గొలుసు కట్టి కుక్క మాదిరిగా తన వెంట తిప్పుకుంది.


ప్రపంచం నలుమూలల జరిగే వింతలు-విశేషాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది… ఓ భార్య తన భర్త మెడలో గొలుసు కట్టి కుక్క మాదిరిగా తన వెంట తిప్పుకుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

బ్రెజిల్‌కు చెందిన లువానా కజాకి, ఆర్థర్ అవర్సో భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఫోటోషూట్ చేశారు. అందులో వారి ఫాంటసీని ప్రపంచానికి పరిచయం చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫోటోషూట్‌లో లువానా స్టైలిష్‌గా పోజులిస్తే.. ఆమె భర్త అర్ధర్‌ కుక్కలా మెడలో గొలుసు వేసుకున్నాడు. ఇక అతడ్ని అలాగే షాపింగ్ మాల్‌కు, రెస్టారెంట్‌కు లువానా తీసుకెళ్ళింది. వీరిని చూసి మిగతా జనాలు ఆశ్చర్యపోయినా.. వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ పనిని ముగించుకున్నారు.

ఈ ఫోటోషూట్ అనంతరం మాట్లాడిన భర్త ఆర్థర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ”తన ప్రేమను తెలియజేయడానికే తాను కుక్కలా మారానని.. దీని వల్ల తాము ఎవరిని బాధపట్టలేదని” ఆర్థర్ చెప్పుకొచ్చాడు. ”ఈ ఫోటోషూట్ గురించి ప్రజలు ఏమనుకున్నా తాము పట్టించుకోం. ఎలాంటి చట్టవిరుద్దమైన పని చేయలేదు. అంతేకాకుండా ఇతరులను నొప్పించకుండా మేము ఈ పని చేశాం. దీని వల్ల మా ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని’ అతడు వివరించాడు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 08:44 AM
Loading...
Unable to load recommendations.
Follow Us