Woman tongue: ఈ అమ్మాయికి నిజంగానే రెండు నాలుకలు.. రెండు టేస్ట్‌లు.. కావాలంటే మీరే చూడండి..
విదేశాల్లో యువత చిత్రవిచిత్ర రీతిలో శరీరంలో మార్పులు చేయడం చూస్తున్నాం. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదంటూ నాలుకకి, నోటికి రింగులు తగిలించుకుంటున్నారు.
విదేశాల్లో యువత చిత్రవిచిత్ర రీతిలో శరీరంలో మార్పులు చేయడం చూస్తున్నాం. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదంటూ నాలుకకి, నోటికి రింగులు తగిలించుకుంటున్నారు. జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. అయితే ఒకామె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. కాలిఫోర్నియాలో ఉంటున్న బ్రియానా మేరీకి తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైనా రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!