Wedding gift: కొత్త పెళ్లికొడుక్కి.. ఫ్రెండ్స్‌ అదిరిపోయేగిఫ్ట్‌.. గిఫ్ట్‌ చూసి పడి పడి నవ్వుకున్న బంధువులు..

Updated on: Aug 15, 2022 | 9:31 PM

సాధారణంగా పెళ్లంటేనే ఎంతో సందడిగా సాగే వేడుక. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సందడిగా సాగే ఈ వేడుకలో కానుకలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రత్యేకమే. ఇటీవల వివాహ వేడుకల్లో రకరకాల గిఫ్ట్‌లు ఇస్తూ


సాధారణంగా పెళ్లంటేనే ఎంతో సందడిగా సాగే వేడుక. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సందడిగా సాగే ఈ వేడుకలో కానుకలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రత్యేకమే. ఇటీవల వివాహ వేడుకల్లో రకరకాల గిఫ్ట్‌లు ఇస్తూ వధూవరులతో పాటు నెటిజన్లనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా కోనసీమ అంబేద్కర్‌ జిల్లాలో ఓ యువకుడికి నిశ్చితార్ధం జరిగింది. ఆ వేడుకలో వరుడి ఫ్రెండ్స్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన రంకిరెడ్డి ప్రసాద్ కు .. చెయ్యేరు గ్రామానికి చెందిన ఏరుబండి రమ్య తో పెళ్ళి కుదిరింది. వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరుగుతున్న తరుణంలో పెళ్లికొడుకు ఫ్రెండ్స్ కాబోయే వధూవరులకు మైండ్ బ్లాక్ అయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన జనం తెగ నవ్వుకున్నారు. సెల్ ఫోన్స్ విస్తరించక ముందు వుండే కాయిన్ బాక్స్ డబ్బా ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసారు..సెల్ ఫోన్లు రాకముందు ఈ కాయిన్ బాక్స్ ల వద్దకే వెళ్ళి మాట్లాడుకునేవారని, వాటిని గుర్తు చేయడాకే ఇలా ఈ గిఫ్ట్ ఇచ్చాము అంటున్నారు పెళ్ళి కొడుకు ప్రసాద్ ఫ్రెండ్స్.. వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా కాయిన్ బాక్స్ చూసి పగలబడి నవ్వుకున్నారు ఎంగేజ్ మెంట్ కు వచ్చిన బంధుమిత్రులు…కాగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 15, 2022 09:31 PM
Loading...
Unable to load recommendations.
Follow Us