రావి ఆకుపై బక్రీద్ కళాఖండం.. విజయనగరం టీచర్ ప్రతిభకు ప్రశంసల వెల్లువ
విజయనగరం జిల్లాకు చెందిన డ్రాయింగ్ టీచర్ జీఎంజీ పరమేశ్వరరావు బక్రీద్ సందర్భంగా రావి ఆకుపై ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. పండుగకు ప్రతీకగా భావించే చిహ్నాన్ని సూక్ష్మంగా కత్తిరించి రూపొందించిన ఈ ఆర్ట్ మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభకు ఇది అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది.
బక్రీద్ పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో ఓ డ్రాయింగ్ టీచర్ తయారుచేసిన ఓ డ్రాయింగ్ అందరినీ ఆకర్షిస్తుంది. కొత్తవలస మండలంలోని దెందేరు జడ్పీ హైస్కూల్‌లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న జీఎంజీ పరమేశ్వరరావు తన ప్రత్యేక కళాత్మక ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. రావి ఆకు పై బక్రీద్ పండుగకు ప్రతీకగా భావించే చిహ్నాన్ని అత్యంత నైపుణ్యంతో కత్తిరించి రూపొందించారు. చిన్న ఆకుపై ఎంతో సూక్ష్మంగా చేసిన ఈ కళాఖండం స్థానిక ప్రజలను, విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది. పండుగ సందర్బంగా సామరస్య భావనను ప్రతిబింబించేలా ఈ కళారూపాన్ని రూపొందించానని టీచర్ పరమేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే ఆయన వివిధ హిందూ దేవతల చిత్రాలు, జాతీయ నాయకుల బొమ్మలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక ఆకృతులను కూడా ఆకుల పై, కాగితాల పై రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. కళ అనేది మతాలకు అతీతమని, ప్రతి పండుగలోని సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే తన లక్ష్యానికి ముందుకు సాగిస్తున్నారు. బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని పేర్కొంటూ ఆ భావాన్ని ప్రతిబింబించేలా ఈ రూపకల్పన చేశారు. పరమేశ్వరరావు రూపొందించిన ఈ వినూత్న కళాఖండాన్ని చూసిన విద్యార్థులు, గ్రామస్తులు ఆయన ప్రతిభను అభినందిస్తున్నారు. సాధారణంగా కనిపించే రావి ఆకును కళాఖండంగా మలచడం నిజంగా అభినందనీయమని పలువురు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న కళాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే మరెన్నో అద్భుతాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బక్రీద్ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కళారూపం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్.. చిన్న వయసులోనే బీపీ ముప్పు