పార్క్‌లో వాకింగ్ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?
విశాఖలో వాకర్స్ ట్యాక్స్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్కుల్లో నడిచేవారు యూజర్ చార్జీలు కట్టాలంటూ ఫ్లెక్సీలు వెలవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు, సోషల్ మీడియా వైరల్ నేపథ్యంలో, జీవీఎంసీ కమిషనర్ స్పందించి, అలాంటి చార్జీలు లేవని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వార్త అవాస్తవమని తేల్చిచెప్పారు. నడక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నా, ఈ వివాదం వాకర్లకు ఊరటనిచ్చింది.
నడక ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసందే. కానీ, నడిస్తే పన్ను కట్టాలనే ముచ్చట ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? విశాఖలో వాకర్స్ ట్యాక్స్ పై రచ్చ పీక్స్‌కు వెళ్లింది. పార్క్‌ల్లో వాకింగ్ చేసేవాళ్లు యూజర్ చార్జీలు చెల్లించాలంటూ GVMC పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. నడిస్తే పన్నేంటేని షాకయ్యారు వాకర్స్. ఇదేం నిర్ణయం అంటూ ఆందోళనకు దిగారు. “నడక మీద కూడా పన్ను వేస్తారా?” అంటూ ప్రజలు, వాకర్లు జీవీఎంసీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాకర్‌ట్యాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కోర్టుకెళ్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇదే అదనుగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, “ఇకపై శ్వాస తీసుకోవడం మీద కూడా ట్యాక్స్ వేస్తారేమో” అంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు జీవీఎంసీ స్పందించింది. ఈ వివాదంపై స్పష్టతనిస్తూ.. “నగరంలోని పార్కుల్లో వాకర్ల నుంచి ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదని జీవీఎంసీ కమిషనర్ శ్రీకేతన్ గార్జ్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వ్యవహారంపై వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. దీంతో, ఉచితంగా నడక సాగించవచ్చని తెలుసుకున్న వాకర్లకు, స్థానికులకు ఊరట లభించింది. ఈ వివాదం మాట ఎలా ఉన్నా.. నడక ఆరోగ్యానికి మంచిదని మాత్రం మర్చిపోవద్దంటున్నారు వైద్య నిపుణులు. కాకపోతే ఆరోగ్య సమస్యలను బట్టి.. వైద్య నిపుణుల సాయంతో నడకను ప్రారంభించడం మంచదని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం
పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!
Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్
నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’