పిచ్చి పీక్స్.. అంటే ఇదేనేమో.. గేదెపై నిలబడి మహిళ డ్యాన్స్
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ముదిరిపోతోంది. పిల్లల మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో రీల్స్ చూస్తుండటంతో.. కొందరు యువతీయువకులు.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి.. వాటిని రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ గేదెపై నిలబడి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ముదిరిపోతోంది. పిల్లల మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో రీల్స్ చూస్తుండటంతో.. కొందరు యువతీయువకులు.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి.. వాటిని రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ గేదెపై నిలబడి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రీల్‌లో ఆ మహిళ ఇంటి బయట కట్టేసిన గేదెపై డాన్స్ చేస్తుండగా.. ఇద్దరు ఆ గేదె కదలకుండా.. ముందు, వెనుక నిలబడ్డారు. ఆ రీల్‌లో..మహిళ గేదె పైకి ఎక్కి నిలబడి స్టెప్పులు వేస్తూ.. కెమెరాకు ఫోజులిచ్చింది. ఇలా చాలా సేపు డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చూసి.. అక్కడకు చేరిన కొందరు నచ్చిన రీతిలో స్టెప్పులు వేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా, దీనిని చూసిన నెటిజన్లు ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు. పిచ్చి పీక్స్‌కు చేరిందని, ఒకవేళ ఆ గేదె అటూ ఇటూ కదలితే ఏమయ్యేదని వారు మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి