Vintage parking: 95 ఏళ్ల క్రితం కార్లను ఎలా పార్క్‌ చేసేవారో తెలుసా.? పార్కింగ్ కోసం అద్భుత టెక్నిక్..

Updated on: Sep 04, 2022 | 9:54 AM

నేటి ప్రపంచమంతా సాంకేతికతపై ఆధారపడి పరిస్థితి నెలకొంది. ప్రతి పనికీ టెక్నాలజీని వినియోగం పెరిగింది. మనుషులు ఏకంగా చంద్రునిపైకి దూసుకుపోతున్నారు.


నేటి ప్రపంచమంతా సాంకేతికతపై ఆధారపడి పరిస్థితి నెలకొంది. ప్రతి పనికీ టెక్నాలజీని వినియోగం పెరిగింది. మనుషులు ఏకంగా చంద్రునిపైకి దూసుకుపోతున్నారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. అయితే ఓల్డ్ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు కొన్ని అంశాలకు సంబంధించి అప్పటి విధానాలు అద్భుతమైనవిగా చెబుతుంటారు. అలాంటి టెక్నిక్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత అందరూ ‘వావ్’ అనక తప్పదు! ప్రపంచంలో వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోడ్లపైకి వాహనాలు అధికంగా రావడంతో ఎక్కడికక్కడ పార్కింగ్‌కు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే, 95 ఏళ్ల క్రితమే ఇందుకోసం అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. కార్లను పార్కింగ్ చేయడానికి, అలాగే పార్కింగ్‌ ప్లేస్‌ నుంచి బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేని టెక్నిక్‌ను కనిపెట్టారు. పార్క్ చేసిన కారును సులువుగా బయటకు తీసేందుకు.. కారు ముందు చక్రాలు తిరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. అద్భుతంగా ఉన్న ఈ టెక్నిక్.. ఇది ప్రస్తుతం ఎక్కడా కనిపించనప్పటికీ, నేటి కాలంలో ఈ సాంకేతికత చాలా అవసరమని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందుకే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనేది. నేటి కాలంలో కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిందే మరీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 04, 2022 09:54 AM
Follow Us