నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??

|

May 10, 2022 | 6:38 PM

ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పిచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్‌లోని​హ్యాంప్​షైర్‌కు చెందిన 34ఏళ్ల వ్యక్తి, రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు.

ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పిచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్‌లోని​హ్యాంప్​షైర్‌కు చెందిన 34ఏళ్ల వ్యక్తి, రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అంతేకాదు, అలా చేయడం వల్ల తనకున్న డిప్రెషన్​పోయిందని అంటున్నాడు. పైగా, మూత్రం తాగడం వల్ల యవ్వనంగా కనిపస్తున్నానని చెబుతున్నాడు. అతనికి గతంలో మానసిక సమస్యలు ఉండేవి. వాటి నుంచి బయటపడాలని ఫిక్స్​అయ్యాడు. అందుకు అతను ‘యూరిన్​ థెరపీ’ని ఎంచుకున్నాడు. 2016 నుంచి తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. రోజుకు 200 మిల్లీ లీటర్ల​ మూత్రం తాగుతాడు. నెల రోజుల పాటు నిల్వ ఉంచిన మూత్రాన్ని తీసుకుని, అప్పుడే బయటకొచ్చిన మూత్రాన్ని కలిపి తాగుతాడు. తన యూరిన్ ఎంతో క్లీన్‌గా ఉంటుందని, వాసన, రుచి బాగుంటుందని ఇతరులకు వికారం వచ్చేలా చెబుతున్నాడు.

Also Watch:

Digital TOP 9 NEWS: బ్యాట్ కొరుక్కుతింటున్న ధోనీ.. వరుడికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన వధువు

Published on: May 10, 2022 06:38 PM