తెల్లవారితే షాపు ఓపెనింగ్.. నిద్రలోనే భార్య, కొడుకు వీడియో
నల్గొండ జిల్లాలో ఓ కుటుంబం కలలు కల్లలయ్యాయి. కేఫ్ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు రేకుల షెడ్డు కూలి భార్య నాగమణి, ఆరేళ్ల కొడుకు విరాట్ కృష్ణ మరణించారు. రైల్వే గ్యాంగ్ మెన్ వెంకన్నతో పాటు కూతురు నందిని, తల్లి పార్వతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నల్గొండ జిల్లా మాడుగులపల్లికి చెందిన వెంకన్న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కలల కేఫ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిదిమేసింది. ఆదివారం తెల్లవారితే ప్రారంభం కావాల్సిన కేఫ్ షెడ్డు కూలి, వెంకన్న భార్య నాగమణి, ఆరేళ్ల కొడుకు విరాట్ కృష్ణ నిద్రలోనే దుర్మరణం పాలయ్యారు. రైల్వే శాఖలో గ్యాంగ్ మెన్ గా పనిచేస్తున్న వెంకన్న, తన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని, ఆర్థికంగా స్థిరపడాలని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఫిల్టర్ కాఫీ కేఫ్ ఏర్పాటుకు ప్లాన్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
