బైక్‌ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!

Updated on: Jun 08, 2026 | 12:54 PM

కార్పొరేట్ ఉద్యోగంలోని రొటీన్ జీవితంతో విసిగిపోయిన దీపక్ పాండే సాయంత్రాల్లో ర్యాపిడో రైడర్‌గా పని చేయడం ప్రారంభించాడు. అదనపు ఆదాయం సంపాదించడంతో పాటు కొత్త వ్యక్తులను కలవడం, నగరాన్ని అన్వేషించడం ద్వారా జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నాడు. ఉద్యోగం, పీహెచ్‌డీ, కంటెంట్ క్రియేషన్‌ను సమతుల్యం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

రొటీన్ లైఫ్ ఎవరికైనా బోర్‌ కొడుతుంది. కానీ బాధ్యతలు, స్థిరమైన జీతం, మరికొన్ని సౌకర్యాల కారణంగా చాలామందికి ఉద్యోగం చేయక తప్పదు. కానీ 9 టు 5 జాబ్‌ విసుగు నుంచి బయట పడేందుకు ఒక యువకుడు ఎంచుకున్న కొత్త మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజూ ఆఫీసులో గంటల తరబడి పని చేసి, అలసిపోయి ఇంటికొచ్చాక ఏదో వెలితిగా అనిపించేది. అలా రోజూ ఒకేలా సాగుతుండటంతో విసుగు చెంది, సాయంత్రం వేళల్లో ఇంట్లోనే కూర్చోకుండా, రాపిడో రైడర్‌గా రిజిస్టర్ చేసుకుని పని ప్రారంభించాడు దీపక్‌ పాండే. అది అతనికి ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ ఎంతో మేలు చేసిందని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. దేశం చుట్టి రావాలన్న తన కలను సాకారం చేయడానికి రోజుకు అదనంగా రూ. 600,రూ. 700 వరకు సంపాదిస్తాననీ అదే ఫుల్‌ టైం రైడింగ్ చేస్తే, రోజు రూ. 1,500 వరకు సంపాదిస్తానంటూ దీపక్ పాండే తన గురించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో అలసిపోయినట్లు అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని దీపక్ తెలిపాడు. ఆఫీస్ పనిలోని రొటీన్ నుంచి తప్పించుకోవడానికి సరదాగా ప్రారంభించిన ఈ ప్రయోగమే రెండో ఆదాయ వనరుగా మారిందని తెలిపాడు. కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు విభిన్న వ్యక్తులతో మాట్లాడటం, నగరాన్ని చుట్టేయడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం కారణంగా సరికొత్త జీవనశైలి అలవాటై కొత్త స్ఫూర్తినిస్తోందని దీపక్ తెలిపాడు. చాలా కాలం ఓటమి భయం, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళన తనను కొత్త విషయాలు ప్రయత్నించకుండా అడ్డుకున్నాయని దీపక్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలసట అనేది మనం చెప్పుకునే ఒక సాకు మాత్రమే. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మన కంఫర్డ్‌జోన్‌ నుంచి బయటికొచ్చి కష్టపడాలి అంటూ తన ఫాలోవర్లకు సందేశమిచ్చాడు. కార్పొరేట్ ఉద్యోగం, ర్యాపిడో ద్వారా అదనపు ఆదాయంతో పాటు, PhD చేస్తున్నాడు. స్వయంగా వంట చేసుకుంటాడు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ, వీడియోలను ఎడిట్ చేసుకుంటాడు. దీంతో దీపక్‌ లైఫ్‌స్టైల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!

తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!

Follow Us