Principal: ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. క్లాసులు బహిష్కరించి బైఠాయించిన విద్యార్థినిలు.. వీడియో.
ఓకాలేజ్ ప్రిన్సిపాల్‌పై కాలేజ్ మొత్తం దండెత్తింది. అధ్యాపకులనుంచి, విద్యార్ధుల వరకూ అందరూ అతనిపై ఫిర్యాదులే. ఈ క్రమంలో మాకొద్దీ ప్రిన్సిపాల్ అంటూ విద్యార్ధినిలు క్లాసులు బహిష్కరించి నిరసనకు దిగారు. అధ్యాపకులంతా వారికి అండగా నిలిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ ప్రవర్తన సరిగా లేదంటూ విద్యార్థినిలు అధ్యాపకులు పోలీసులను ఆశ్రయించారు.
ఓ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై కాలేజ్ మొత్తం దండెత్తింది. అధ్యాపకులనుంచి, విద్యార్ధుల వరకూ అందరూ అతనిపై ఫిర్యాదులే. ఈ క్రమంలో మాకొద్దీ ప్రిన్సిపాల్ అంటూ విద్యార్ధినిలు క్లాసులు బహిష్కరించి నిరసనకు దిగారు. అధ్యాపకులంతా వారికి అండగా నిలిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ ప్రవర్తన సరిగా లేదంటూ విద్యార్థినిలు అధ్యాపకులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాలలో ధర్నా చేపట్టారు. అంతేకాదు అధ్యాపకులు, విద్యార్ధినిలు అంతా కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ అకారణంగా అందరినీ తిడుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. అంతేకాదు, కాలేజీకి రావాలంటే భయమేస్తుందని, మనశ్శాంతి ఉండట్లేదని, పిల్లలకు సరిగా పాఠాలు చెప్పలేకపోతున్నామంటున్నారు అధ్యాపకులు. ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా అంతా ఏకమై ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న గుత్తి సిఐ వెంకటరామిరెడ్డి కళాశాలకు వెళ్లి విద్యార్ధినులు, అద్యాపకులను విచారించారు. అనంతరం ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..