Tiple Talaq effect: భార్యకు తలాక్‌ చెప్పిన భర్త.. పుష్ప లెవల్లో దిమ్మదిరిగే షాకిచ్చిన మహిళ.. మరో హిందువును..

|

Oct 01, 2022 | 9:50 PM

ఉత్తరప్రదేశ్ కు చెందిన షోయబ్ ఉత్తరాఖండ్ కు చెందిన రుబీనాఖాన్ ను 9సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భర్త షోయబ్ ట్రిపుల్ తలాఖ్ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.


ఉత్తరప్రదేశ్ కు చెందిన షోయబ్ ఉత్తరాఖండ్ కు చెందిన రుబీనాఖాన్ ను 9సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భర్త షోయబ్ ట్రిపుల్ తలాఖ్ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ముగ్గురు కుమారులకు తల్లి అయిన రుబీనాఖాన్ కు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆమె పుష్పగా మారి భర్త స్నేహితుడు ప్రేమ్ పాల్ గంగ్వార్ ను పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నగరం నవాబ్ గంజ్ లో హిందూ సంప్రదాయం ప్రకారం రుబీనాఖాన్, ప్రేమ్ పాల్ గంగ్వార్ విహహం జరిగింది.మొదటి భర్త షోయబ్ డ్రైవరుగా పనిచేసే వాడని, తనపై అనుమానంతో తరచూ వేధించేవాడని రుబీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వారం రోజుల క్రితం తలాక్‌ చెబుతూ రుబీనాను ఇంటి నుంచి గెంటేశాడు. ఆసమయంలో షోయబ్ కారణంగా పరిచయమైన ప్రేమ్ పాల్ తనను ఆదరించడంతో ఆమె ‘పుష్ప’గా మారి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఈవిషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ట్రిపుల్ తలాక్ ఘటనలు చాలానే చూశాం. అయితే మత సంప్రదాయాలకు కట్టుబడి మహిళలు చాలామంది ట్రిపుల్ తలాక్ తో ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ ను నిషేధిస్తూ పార్లమెంటులో 2019లో చట్టంచేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత ట్రిపుల్ తలాక్ ఘటనలు కొంతమేర తగ్గినా.. ఇంకా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని సమర్థంగా ఎదుర్కొని రుబీనా ఖాన్ మతం మారి హిందూమతానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం రుబీనా ఖాన్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 09:49 PM