Viral Video: టీచర్లను చెట్టుకు కట్టేసి చితకబాదిన విద్యార్ధులు.. ఎందుకో తెలుసా..? వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 05, 2022 | 9:58 AM

జార్ఖండ్‌ లోని దుమ్కాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లో విద్యార్ధులు రెచ్చిపోయారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వేశారని టీచర్లను చితకబాదారు. టీచర్లను చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్ధులు.

జార్ఖండ్‌ లోని దుమ్కాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లో విద్యార్ధులు రెచ్చిపోయారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వేశారని టీచర్లను చితకబాదారు. టీచర్లను చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్ధులు. దుమ్కా జిల్లా గోపికందర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్ధులు దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు , పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఇతర టీచర్లు విద్యార్ధులను విడిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ స్కూలుకు సంబంధించి జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ తాజాగా తొమ్మిదో తరగతి ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 32 మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ మార్కులు రావడమంటే ఫెయిల్‌తో సమానమే. తమకు తక్కువ మార్కులు రావడంతో వారిలో కొందరు విద్యార్థులు కోపం తెచ్చుకున్నారు. దీనికి బాధ్యుడు అని భావిస్తూ మ్యాథ్స్ టీచర్‌ను, మార్కులు ఆన్‌లైన్‌లో పెట్టిన క్లర్కును చెట్టుకు కట్టేసి కొట్టారు. మొత్తం 11 మంది విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు స్కూలు యాజమాన్యంతో పాటు బాధితులు నిరాకరించారు. ప్రస్తుతం స్కూళ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 09:58 AM