Mother and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Edited By:

Updated on: Apr 07, 2023 | 1:07 PM

సింగపూర్‌లో పనిచేస్తూ అక్కడే సెటిల్‌ అయిన ఒక భారతీయుడు తన తల్లికి కూడా బయటి ప్రపంచాన్ని చూపించాలనుకున్నాడు. ఈ క్రమంలో దత్తాత్రేయ అనే తన అమ్మను సింగపూర్‌ తీసుకెళ్లాడు.

సింగపూర్‌లో పనిచేస్తూ అక్కడే సెటిల్‌ అయిన ఒక భారతీయుడు తన తల్లికి కూడా బయటి ప్రపంచాన్ని చూపించాలనుకున్నాడు. ఈ క్రమంలో దత్తాత్రేయ అనే తన అమ్మను సింగపూర్‌ తీసుకెళ్లాడు. అందుకుసంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానికి ఒక క్యాప్షన్‌ ఇచ్చాడు. తన తరంలో విదేశాలకు వెళ్లిన మొదటి మహిళ అని రాశాడు. తన తల్లికి తెలిసిన ప్రపంచానికి అవతలి వైపు ఎలా ఉందో చూపించానని చెప్పాడు. తాను పనిచేస్తున్న చోట ఎలా ఉంటుందో అమ్మకు తెలియాలనే సింగపూర్‌కు తీసుకొచ్చానంటూ రాసుకొచ్చారు. అమ్మ జీవితమంతా గ్రామంలోనే గడిపిందని, ఎప్పుడూ విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదని వివరించాడు.ఇదిలా ఉంటే.. అతని తల్లి తన తరంలో మొదటి వ్యక్తి. ఆమె గ్రామం నుండి విదేశాలకు వెళ్ళిన రెండవ మహిళ. ఇది అనుభవించడానికి తన తండ్రి కూడా ఉండి ఉంటే బాగుండేదని అతను ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. అందుకే ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తులు తమ తల్లిదండ్రులను తమతో ఎప్పుడైనా తీసుకెళ్లి, ప్రపంచంలోని మరొక అందమైన ప్రదేశాన్ని వారికి చూపించాలని కోరుతున్నాను అంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. నన్ను నమ్మండి, ఇలా చేయడం ద్వారా మీరు వారు పొందే ఆనందాన్ని కొలవలేరు’ అంటూ దత్తాత్రేయ లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ను 3 లక్షలమందికి పైగా వీక్షించడమే కాదు లైక్‌ చేస్తూ అనేక కామెంట్లు రాసుకొచ్చారు. ఒక వినియోగదారు.. ఇది నిజంగా అద్భుతం అని వ్రాయగా.. మరొకరు..ప్రియమైన సోదరా, మీరు ఎవరో నాకు తెలియదు? కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీకు అభినందనలు, శుభాకాంక్షలు..! అంటూ ప్రశంసల కామెంట్లు కుమ్మరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 02, 2023 08:44 PM
Loading...
Unable to load recommendations.
Follow Us