Lady Tehsildar personal: లేడీ తహసీల్దార్‌కు ఎంతమంది భర్తలంటూ ఆర్టీఐకి దరఖాస్తు.. దిమ్మతిరిగే జవాబు.!
కోలారు జిల్లా ముల్‌బాగిలు తాలూకాకు చెందిన మందకల్ నాగరాజ్ అనే వ్యక్తి.. మహిళా తహసీల్దార్ వ్యక్తిగత విషయాలను కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశాడు. అందులో మండల మహిళా తహసీల్దార్‌కు
RTI సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా సులభంగా పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఎన్నో అక్రమాలు, అవినీతి కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సామాన్యులకు ఆర్టీఐ చట్టం ఓ ఆయుధంగానే దొరికిందనే చెప్పుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది దుర్వినియోగం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రబుద్ధుడు సిల్లీ ప్రశ్నలు అడిగి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఓ ప్రభుత్వ అధికారి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు. దాంతో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కోలారు జిల్లా ముల్‌బాగిలు తాలూకాకు చెందిన మందకల్ నాగరాజ్ అనే వ్యక్తి.. మహిళా తహసీల్దార్ వ్యక్తిగత విషయాలను కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశాడు. అందులో మండల మహిళా తహసీల్దార్‌కు ఎన్నిసార్లు పెళ్లైందని, ఆమె ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు.. ప్రస్తుతం ఆమె భర్త ఎవరని, ఆమెకు పెళ్లి ఎక్కడ జరిగిందని, ఆమె వివాహ ధ్రువపత్రం, కల్యాణ మండపం వివరాలు, పెళ్లి శుభలేఖ కూడా అడిగాడు. అలాగే ఆమె గతంలో పెళ్లి చేసుకున్నవారు ఎందుకు వదిలేశారని, భర్తలు అందరూ ఆమెకు విడాకులు ఇచ్చారా.. లేదా..? అని కూడా అడిగాడు. దరఖాస్తు చూసిన వెంటనే ఇవేం పిచ్చి ప్రశ్నలని .. కర్ణాటక కోలార్ జిల్లా ములబగిలు మండలం రెవెన్యూ కార్యాలయం సిబ్బంది బిత్తరపోయారు. సమాచార హక్కు చట్టం కింద ఇలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకుంటారా..? అని ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకుని నాగరాజ్ చేసిన అడిగిన ప్రశ్నలపై ఆ మహిళా తహసీల్దార్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో నాగరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..