ఛత్తీస్‌గఢ్‌లో దారుణం వెలుగు చూసింది. భర్తతో గొడవపడి ఓ మహిళ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త బావిలోకి దూకాడు. బావి నుండి ఆమెను రక్షించి, కొన్ని క్షణాల తరువాత ఆమెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. జష్పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శంకర్‌రామ్, అతని భార్య ఆశాబాయి ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించి పడుకున్నారు. శంకర్ తనతో శృంగారంలో పాల్గొనాలని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆశా బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. భార్యను కాపాడేందుకు శంకర్ కూడా బావిలోకి దూకి.. సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అయితే మళ్లీ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన శంకర్ ఆశా ప్రైవేట్ భాగాలపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం రాత్రంతా భార్య మృతదేహం దగ్గరే కూర్చున్నాడు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..