Marriage Fight: స్టేజీపైనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధువరులు..! పాపం భార్యకు స్వీట్ తినిపించడం తప్పా…

Updated on: Dec 23, 2022 | 9:57 AM

పెళ్లంటే నూరేళ్ల పంట.. వివాహం ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే జరిగే అపురూపమైన వేడుక. అందుకే తమ పెళ్లిని పది మంది పది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని వధూవరులు కలలుకంటుంటారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుంటారు.


కొన్ని పెళ్లిళ్లు హంగూ ఆర్భాటాలతో ఫేమస్ అయితే.. మరికొన్ని మాత్రం గొడవలతో వైరల్ అవుతుంటాయి. భోజనం పెట్టలేదనో, చికెన్, మటన్ వడ్డించలేదనో, వరుడికి తగినంత కట్నం ఇవ్వలేదనో.. ఇలా కారణాలు ఎన్నైనా.. ఆఖరికి దారి తీసేదీ గొడవకే. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి రిసెప్షన్ సందర్భంగా వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. జయమాల ధారణ చేసుకునే సమయంలో ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటారు. అయితే వరుడు వధువు నోట్లో స్వీట్ పెట్టగానే ఆమె చాలు అంటూ సైగ చేసింది. అయినా వరుడు ఆగకుండా బలవంతంగా తినిపించేందుకు ట్రై చేశాడు. వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది. ముందు వెనకా చూడకుండా ఎడపెడా వాయించేసింది. ఇక వరుడు ఊరుకుంటాడా.. అతను కూడా ఇష్టమొచ్చినట్లు వధువును కొట్టాడు. ఊహించని ఈ ఘటనకు మండపంలో ఉన్న బంధుమిత్రులంతా షాకయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యి.. వారిని కంట్రోల్ చేశారు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Follow Us