యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది

Updated on: Nov 25, 2024 | 9:22 PM

టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యం దరి చేరకుండా యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం అనేక చికిత్సలు చేసుకుని వయసును తగ్గించుగోలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని షాక్‌ ఇచ్చింది.

దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్‌ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు. యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్‌ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్‌ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే “ప్రాజెక్ట్ బేబీ ఫేస్” అంటారట. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని తెలిపాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్, యాంటీ ఏజింగ్‌ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్‌ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని ??

చితి నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ !! షాకింగ్‌ ఘటన

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??

Published on: Nov 25, 2024 09:20 PM
Loading...
Unable to load recommendations.
Follow Us