అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
బెంగళూరులో ఉన్న తన కోడలికి మాల్దా మామిడిపండ్లు ఇష్టమని తెలుసుకున్న బీహార్‌కు చెందిన అత్తగారు ఒక సూట్‌కేస్ నిండా మామిడిపండ్లు పంపించారు. "మేరీ బహూ ఖాయేగీ" అంటూ ప్రేమగా ప్యాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్తాకోడళ్ల మధ్య ఉన్న ఆప్యాయతకు ఇది నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణంగా సోషల్ మీడియాలో అత్తాకోడళ్ల గొడవలు, సీరియల్స్ రేంజ్ డ్రామాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, వీరిద్దరి మధ్య ఉండే పవిత్రమైన ప్రేమానురాగాలను చాటిచెప్పే ఒక అందమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బెంగళూరులో ఉంటున్న తన కోడలి కోసం బీహార్‌కు చెందిన ఒక అత్తగారు చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. బెంగళూరులో నివసిస్తున్న శ్రేయ అనే మహిళ, తనకు ‘మాల్దా’ రకం మామిడిపండ్లంటే చాలా ఇష్టమని బీహార్‌లో ఉన్న తన అత్తగారితో ఫోన్లో సరదాగా చెప్పింది. కోడలి నోటి నుంచి ఆ మాట రావడమే ఆలస్యం.. ఆ అత్తగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకంగా ఒక పెద్ద సూట్‌కేస్ నిండా నోరూరించే మాల్దా మామిడిపండ్లను ఎంతో జాగ్రత్తగా సర్దారు. ఆ సమయంలో ఆమె ఎంతో ప్రేమగా “మేరీ బహూ ఖాయేగీ” అని అనడం అందరినీ ఫిదా చేస్తోంది. ఆ మాటకు అర్థం… నా కోడలు తింటుంది అని. ఆ తర్వాత బెంగళూరులో ఆ సూట్‌కేస్ అందుకున్న కోడలు శ్రేయ.. లోపల ఉన్న మామిడిపండ్లను చూసి ఆనందంతో మురిసిపోయింది. పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో పండే ఈ ప్రత్యేకమైన ‘మాల్దా’ మామిడిపండ్లు చాలా తీయగా ఉంటాయి. అంత దూరం ప్రయాణంలో పండ్లు పాడైపోకుండా అత్తగారు ప్యాక్ చేసిన తీరు అద్భుతం. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “అత్తాకోడళ్ల బంధానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్” అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
