రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??

|

May 27, 2022 | 9:13 AM

అబ్బ.. గా సిన్మాల హీరో ఏస్కున్న డ్రెస్సు ఎంత మంచిగుంది. అసొంటియి రెండు అంగీలు కొనాలే. అరె గీ సిన్మాల హీరో పబ్లిక్కుకు ఎంత సాయం జేశిండు. మనం గుడ ఉన్నంతల ఎంతో కొంత జెయ్యాలే.

అబ్బ.. గా సిన్మాల హీరో ఏస్కున్న డ్రెస్సు ఎంత మంచిగుంది. అసొంటియి రెండు అంగీలు కొనాలే. అరె గీ సిన్మాల హీరో పబ్లిక్కుకు ఎంత సాయం జేశిండు. మనం గుడ ఉన్నంతల ఎంతో కొంత జెయ్యాలే. ఇగో ఇట్ల హీరోను రోల్‌మాడల్‌గ జేస్కోని మస్తు మంది అభిమానులు ఆళ్ల తొవ్వల పోతుంటరు. అట్లనే ఓ అన్న అజయ్‌ దేవగన్‌ సార్ను రోల్‌మాడల్‌గ చేసుకొని ఆయ్న తొవ్వల నడిస్తే ఉత్తగ పోలీసులు జైళ్ల వారేశిర్రు పాపం. అగో అజయ్‌ దేవగన్‌ సారు రెండు రన్నింగు కార్ల మీద కాలు వెట్టి పోతుంటే అబ్బ.. ఏం చేస్తున్నడు రా అన్పియ్యవట్టే. మరి ఇసొంటి సీన్లు సూశ్నమా ఎంజాయి జేశ్నమా అన్నట్టు ఉండాలే. కని పులిని సూశి నక్క వాతవెట్టుకున్నట్టు.. నేను కూడ హీరోనే అన్కుంట కార్ల సీన్‌ను కాపీ కొట్టిండు ఢిల్లీ నోయిడాలుండే రాజీవ్‌ అనే ఈ తోపుతురంఖాను.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పెళ్ళిపీటల మీద ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి రద్దు చేసుకున్న పిల్ల

తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి.. సంతోషం తో కొడుకు రియాక్షన్‌ కి ఫిదా అయిపోయిన నెటిజన్స్

Published on: May 27, 2022 09:13 AM