Cow in ATM: అబ్బా ఏసీ ఎంత బాగుందో.. ఏటీఎం సెంటర్‌లో ఆవు.. ఏం చేసిందో మీరే చూడండి..

|

Nov 23, 2022 | 9:34 AM

ప్రతిరోజూ మనం ఇంటర్నెట్‌లో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. తద్వారా ప్రపంచంలో ఏమూలన ఏం జరుగుతుంతో తెలుసుకోగలుగుతున్నాం. వాటి ద్వారా నవ్వుకుంటుంన్నాం..


ప్రతిరోజూ మనం ఇంటర్నెట్‌లో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. తద్వారా ప్రపంచంలో ఏమూలన ఏం జరుగుతుంతో తెలుసుకోగలుగుతున్నాం. వాటి ద్వారా నవ్వుకుంటుంన్నాం.. ఎమోషనల్‌ అవుతున్నాం.. ఆశ్చర్యపోతున్నాం.. ఇన్‌స్పైర్‌ కూడా అవుతున్నాం. ఇందంతా సోషల్‌మీడియా పుణ్యమే అని చెప్పుకోవాలి. తాజాగా ఓ ఆవుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏటీఎం కనిపిస్తుంది. అందులో ఓ ఆవు పడుకొని ఉంది. నాన్-ఏసీ పశువుల కొట్టంలో ఉక్కపోత భరించలేకపోయిందనుకుంటా.. ఆవు హాయిగా ఏసీలో సేదతీరుతుంది. కానీ, అది అంతటితో ఆగలేదు.. ఏటీఎం సెంటర్‌ని పూర్తి గోశాలగా మార్చేసి రచ్చరచ్చ చేసేసింది. ఇక క్యాష్‌ కోసం వచ్చిన కస్టమర్ల తంటాలు చూడాల్సిందే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా గ్రామంలో చోటుచేసుకుంది. ఆవుపేడతో నిండిపోయిన ATM మెషిన్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడంలో స్థానికులు ఇబ్బంది పడుతున్న వీడియోను ఒక జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఏటీఎం సెంటర్‌లోపల ఎటు చూసినా ఆవుపేడతో నిండిపోయింది. ఇక ఆ ఆవు ATM మెషిన్ ముందే పడుకుని ఉంది. మిషిన్‌లో ఉన్న డబ్బంతా నా సొంతమే అన్నట్టుగా ఉంది. ఇక దాంతో ఆ మనిషి తన టీ-షర్టుతో ముక్కు మూసుకుని మెషిన్ నుండి నగదు తీసుకోవడానికి చిన్న శుభ్రమైన ప్రదేశంలో జాగ్రత్తగా నిలబడి క్యాష్‌ తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తి మేనల్లుడు వీడియో చిత్రీకరించాడని జర్నలిస్టు ట్వీట్‌లో తెలిపారు. ఈ వీడియోను వేలమంది వీక్షించగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆవు గురించి ఆందోళన చెందుతున్న కొంతమంది నెటిజన్లు అనారోగ్యం కారణంగా విరేచనాలు కావచ్చు.. దానిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాలండి అంటూ కామెంట్‌ చేశారు. ATM గార్డు ఎక్కడ ఉన్నారనే విషయంపై దృష్టి పెట్టడం ముఖ్యం అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on