Strange substance: సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..

|

Oct 16, 2024 | 12:49 PM

తాజాగా, ఇలాంటి మిస్టరీ పదార్థాన్ని న్యూఫౌండ్ లాండ్ సముద్ర తీరాల్లో గుర్తించారు. ఇది వంట నూనె వాసన వస్తోందని ఓ స్థానికుడు తెలిపారు. బీచ్ లలో ఇలాంటి అసాధారణ పదార్థాలు కనిపిస్తున్నాయన్న మాట.. గత సెప్టెంబరు నుంచి వినిపిస్తోంది. ఈ పదార్థం మూలాలు ఏంటన్నది తెలుసుకునేందుకు స్థానిక అధికార వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది చమురు ఉత్పత్తులకు..

సముద్రం వివిధ రకాల వింత జీవులకు ఆవాసం. ఒక్కోసారి అవి సముద్రతీరానికి కొట్టుకొస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒక్కోసారి అవేంటో పరిశోధకులకు కూడ అంతుపట్టకుండా ఉంటాయి. కొన్ని వస్తువులు, పదార్థాలు కూడా తీరానికి కొట్టుకువచ్చినా అవేంటో కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. అలాగే మిస్టరీగా మిగిలిపోతుంటాయి.
అలాంటి ఓ వింత పదార్ధం కెనడాలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. కెనడాలోని పలు బీచ్ లలో ఇటీవల తరచుగా ఓ వింత పదార్థం కొట్టుకొస్తుండడం అంతుపట్టని వ్యవహారంలా మారింది. సరిగా ఉడకని పిండి ముద్దలా కనిపిస్తున్న ఈ పదార్థం ఏంటన్నది ఇంతవరకు గుర్తించలేకపోయారు.

తాజాగా, ఇలాంటి మిస్టరీ పదార్థాన్ని న్యూఫౌండ్ లాండ్ సముద్ర తీరాల్లో గుర్తించారు. ఇది వంట నూనె వాసన వస్తోందని ఓ స్థానికుడు తెలిపారు. బీచ్ లలో ఇలాంటి అసాధారణ పదార్థాలు కనిపిస్తున్నాయన్న మాట.. గత సెప్టెంబరు నుంచి వినిపిస్తోంది. ఈ పదార్థం మూలాలు ఏంటన్నది తెలుసుకునేందుకు స్థానిక అధికార వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది చమురు ఉత్పత్తులకు చెందిన పదార్థం అనే వాదనలను కెనడా పర్యావరణం, వాతావరణ మార్పుల సంస్థ కొట్టిపారేసింది. అంతేకాదు, ఇందులో ఎలాంటి జీవ సంబంధ కణజాలం కానీ, సముద్ర స్పంజికల ఆనవాళ్లు కానీ లేవని కెనడాకు చెందిన ఓ సముద్ర శాస్త్ర నిపుణుడు తేల్చి చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on