ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

Updated on: Jun 01, 2026 | 12:13 PM

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఆకర్షితుడైన జలంధర్‌కు చెందిన గుర్జిత్ సింగ్ తన ఇంటి పైకప్పుపై దాని ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదే సమయంలో అసలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తిరిగి ఇవ్వాలంటూ ఫ్రాన్స్ నేత చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఫ్రాన్స్ మధ్య రాజకీయ చర్చకు దారితీశాయి.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అనగానే ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ గుర్తొస్తుంది. ఆ విగ్రహం ఇప్పుడు ఇండియాలోనూ దర్శనమిస్తోంది. పంజాబ్‌లోని జలంధర్​ నగరానికి చెందిన గుర్జిత్ సింగ్ 26 ఏళ్లుగా న్యూయార్క్ లో నివసిస్తున్నారు. అక్కడ అతనికి కన్​స్ట్రక్షన్ బిజినెస్​ ఉందట. అయితే, అక్కడికి వెళ్లిన ప్రతీసారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసేందుకు ఇష్టపడేవారు. ఇటీవల స్వేచ్ఛా విగ్రహమైన స్టాచ్యూను తన ఇంటి పైకప్పుపైనే ప్రతిష్టించాలని భావించారు. ​ జలంధర్‌లోని కిషన్‌పురా ప్రాంతంలో ఉన్న తన ఇంటి నాలుగో అంతస్తులో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విగ్రహం ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది విగ్రహం దగ్గరకు చేరుకుని ఫొటోలు దిగుతున్నారు. న్యూయార్క్‌ లోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ని అమెరికాకు ఫ్రాన్స్ బహూకరించింది. తాజాగా ఈ స్మారకం కారణంగా రాజకీయ కలకలం రేగుతోంది. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని తమకు తిరిగిచ్చేయాలని ఫ్రాన్స్‌ కు చెందిన నేత ఇటీవల డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేసింది. ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ గ్లక్స్‌మాన్‌ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తిరిగి ఇవ్వమని అమెరికాను కోరినట్లు తెలిపారు. ఏ విలువలను చూసి ఆ విగ్రహాన్ని అందజేశామో ఆ విలువలు ప్రస్తుతం అమెరికాలో కనిపించడం లేదని ఆయన విమర్శించారు. అందుకే దాన్ని వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీన్‌ లీవిట్‌ స్పందించారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో తాము.. ఫ్రెంచి వారికి అండగా నిలబడటం వల్లనే.. నేడు ఫ్రాన్స్ నిలబడగలిగిందిని, లేకుంటే ఈ పాటికి అది జర్మనీలో భాగమై.. అక్కడి జనం జర్మన్ భాష మాట్లాడుతూ ఉండేవారని కౌంటరిచ్చారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ నేత గుర్తు చేసుకోవాలన్నారు. దీనికి వారు యూఎస్‌కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలన్నారు. న్యూయార్క్‌లో 1886లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఏర్పాటుచేశారు. యూఎస్‌తో స్నేహబంధానికి గుర్తుగా ఫ్రాన్స్ ఈ స్మారకాన్ని బహుకరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్‌!

విమానం నుంచి చూస్తే ‘భారత్-పాక్’ సరిహద్దు ఎలా ఉందో తెలుసా?

Follow Us