ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత

Updated on: Feb 21, 2026 | 12:48 PM

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్‌ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కింగ్స్ కాలేజీ లండన్ విశ్వవిద్యాలయాల్లో ఒకేసారి ప్రవేశానికి ఎంపికయ్యారు. జిల్లా నుంచి ఈ మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైన తొలి విద్యార్థిగా చరిత్ర సృష్టించారు. ఆయన సామాజిక అంశాలపై పట్టు, రాజకీయ విశ్లేషణలో అనుభవం కూడా ఉంది. ఈ విజయం తెలుగు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.

తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత సాధించి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ , కింగ్స్ కాలేజీ లండన్.. ఈ మూడు అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి ఒకేసారి ఎంపికై చరిత్ర సృష్టించారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త ..నూర్తి కళ్యాణ్ బాబు కుమారుడైన అభి చంద్ర కార్తీక్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ‘ఎంఫిల్ డెవలప్‌మెంట్ స్టడీస్’ చదివేందుకు అవకాశం పొందారు. జిల్లా నుంచి ఈ మూడు ప్రతిష్ఠాత్మక వర్సిటీలకు ఎంపికైన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. శ్రీకాకుళం సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించిన ఆయన, చిన్నప్పటి నుంచే చదువులో అత్యంత ప్రతిభ కనబరిచారు. అభి కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా పట్టు సాధించారు. కింగ్స్ కాలేజీలో పట్టా పొందిన అనంతరం, కేంబ్రిడ్జ్ వర్సిటీ నిర్వహించిన ‘ఎంగెల్స్‌బర్గ్ అప్లైడ్ హిస్టరీ ఫెలోషిప్’కు కూడా ఎంపికయ్యారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు వద్ద ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ ఇంటర్న్‌గా పనిచేసి రాజకీయ విశ్లేషణలోనూ అనుభవం గడించారు. ఒక సామాన్య జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అభి చంద్ర కార్తీక్‌పై జిల్లావ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న

Follow Us