పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

Updated on: Mar 18, 2026 | 5:13 PM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వింత చోరీ జరిగింది. ఆరుగురు మహిళలు ఫ్యాన్సీ షాపును బంగారం షాపు అనుకుని లోపలికి ప్రవేశించారు. రోల్డ్ గోల్డ్ అని తెలిసినా, చాకచక్యంగా రూ.18,000 విలువైన గిల్టు నగలను దొంగిలించారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలిస్తున్నారు. ఈ 'కిలాడీ లేడీల' చోరీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా దొంగలు బంగారం షాపులపై కన్నేయడం సహజం. ఇటీవల బంగారం దుకాణాల్లో కస్ట్‌మర్స్‌లా వచ్చి దుకాణదారులను మాటల్లో పెట్టి నగలు కొట్టేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనమే శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. కానీ పాపం వాళ్లు బంగారం షాపు అనుకొని లోపలికి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసీ.. అయ్యో.. రోల్డ్‌గోల్డ్‌లో కాలేసామే..అని నాలుక్కరుచుకున్నారు. అయినా ఎలాగూ వచ్చాం కదా.. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకు?” అనుకున్నారో ఏమో కానీ, తమ చేతివాటం చూపించి షాక్ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఈ వింత చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ‘వాసవి కలెక్షన్స్’ అనే ఫ్యాన్సీ షాపు బోర్డు చూసి, అది గోల్డ్ షాపు అని భ్రమపడ్డ ఆరుగురు మహిళలు కస్టమర్ల మాదిరిగా లోపలికి ప్రవేశించారు. అది రోల్డ్ గోల్డ్ షాపు అని అర్థమయ్యాక కూడా వారు వెనక్కి తగ్గలేదు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆరుగురిలో ఇద్దరు సేల్స్ గర్ల్‌ను మాటల్లో పెట్టగా, మరో ఇద్దరు అడ్డుగా నిలబడ్డారు. ఇంకేముంది.. మిగిలిన ఇద్దరు మహిళలు షాపు అరల్లో ఉన్న రోల్డ్ గోల్డ్ ఆభరణాలను చకచకా సర్దేసి, ఎవరికీ అనుమానం రాకుండా జారుకున్నారు. ఆరుగురు మహిళలు వచ్చారు కానీ ఏమీ కొనకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన యజమాని వెంటనే సీసీ టీవీ ఫుటేజ్ తనిఖీ చేశాడు. అందులో వారి ‘కళాపోషణ’ చూసి అవాక్కయ్యాడు. సుమారు రూ.18 వేల విలువైన గిల్టు నగలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ‘కిలాడీ లేడీల’ చోరీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Gold Price Today: తగ్గిన బంగారం, వెండిధర.. ఇవాళ తులం ఎంతంటే..!

FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్

Follow Us