Tajmahal: తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. వాటి రహస్యాన్ని బయటపెట్టాలి..!

|

May 19, 2022 | 9:07 AM

తాజ్‌ మహల్‌లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 20 గదులను తెరిచేందుకు భారత పురావస్తు శాఖ ASIని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా


తాజ్‌ మహల్‌లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 20 గదులను తెరిచేందుకు భారత పురావస్తు శాఖ ASIని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్‌చార్జి రజనీష్ సింగ్ మే 4న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.మరోవైపు రాజస్థాన్ రాజసమంద్‌ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా ఈ పిటిషన్‌ను స్వాగతించారు. తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న 20 గదులను తెరిచి చూడాలని కోరడం సమంజసమే అని ఆమె తెలిపారు. ఆ గదులను ఎందుకు మూసి ఉంచారన్నది తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపితే మూసి ఉన్న గదుల వెనుక ఉన్న మర్మం ఏమిటదన్నది బయటపడుతుందని అన్నారు.

కాగా.. తాజ్ మహల్ నిర్మించిన స్థలం వాస్తవానికి జైపూర్ రాజ కుటుంబానికి చెందినదని ఆమె అన్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమి జైపూర్‌ రాజ కుటుంబీకులదే అనేందుకు తమ వద్ద పత్రాలు ఉన్నాయని తెలిపారు. ఆ కాలంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ లేనందున మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్న ఆ స్థలం గురించి ఎలాంటి అపీల్‌ చేయలేదన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 19, 2022 09:07 AM