స్కూలు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న డ్రైవర్.. వీడియో చూస్తే..

|

Jul 27, 2023 | 9:31 PM

తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి స్కూల్‌కి, ఆ తర్వాత ఇంటికి క్షేమంగా చేరుకుంటారని ఆటోనో, వ్యానో, లేదా బస్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి పిల్లలను వాహనాల్లో పంపిస్తారు. అయితే ఇక్కడ స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న వాహనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి స్కూల్‌కి, ఆ తర్వాత ఇంటికి క్షేమంగా చేరుకుంటారని ఆటోనో, వ్యానో, లేదా బస్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి పిల్లలను వాహనాల్లో పంపిస్తారు. అయితే ఇక్కడ స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న వాహనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే అది స్కూలు పిల్లల వ్యానా లేక గొర్రెలను మార్కెట్‌కు తీసుకెళ్తున్న వాహనమా అనిపిస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యానులో స్కూలుకు పిల్లలను తీసుకెళ్తున్నాడు డ్రైవర్‌. అతను ఏకంగా వ్యాను మొత్తం పిల్లలు నిండిపోగా చాలామంది వెనుక వేలాడుతూ నిలబడ్డారు. అంతేకాదు మరికొంతమంది పిల్లలు ఆ వ్యాను టాప్‌ పైన కూర్చుని ఉన్నారు. ఇంకొందరు బ్యానెట్‌పైన కూర్చుని అత్యంత ప్రమాదరకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. దాదాపు 24 మంది విద్యార్ధులను ఆ వ్యానులో తీసుకెళ్తున్నాడు డ్రైవర్‌.