Viral Video: స్పీడ్‌గా వెళ్తున్న రైలు నుంచి యువకుల డేంజర్ స్టంట్స్.. నెట్టింట వీడియో వైరల్
సోషల్ మీడియా పుణ్యామా అని వైరల్ వార్తలు, వెరైటీ స్టంట్స్ కు కొదువే లేకుండా పోయింది...ప్రతి చిన్న వీడియో నెట్‌లోతెగ వైరల్ అవుతుంది. అలాగే లైక్స్ కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలా మంది.
సోషల్ మీడియా పుణ్యామా అని వైరల్ వార్తలు, వెరైటీ స్టంట్స్ కు కొదువే లేకుండా పోయింది…ప్రతి చిన్న వీడియో నెట్‌లోతెగ వైరల్ అవుతుంది. అలాగే లైక్స్ కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలా మంది. డిఫరెంట్‌గా ట్రై చేస్తే ఎక్కువ లైక్స్, షేర్స్ అందుకొవచ్చని తెగ ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు సరదాకు చేసిన పనులు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా కొందరు యువకులు అత్యంత ప్రమాదకర స్టంట్స్ చేశారు.. ఒక చేత్తో రైలు పట్టుకుని ప్రాణాంతకమైన విన్యాసాలు చేశారు. స్పీడ్‌గా వెళ్తున్న రైలు నుంచి వారు చేస్తున్న వీడియోలు చూస్తే ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా వేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..