చిన్నారిని క్యాబ్‌లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??

Updated on: Feb 20, 2026 | 1:19 PM

ఒక కుటుంబం ప్రయాణం చేసి ఇంటికి వచ్చాక, తమ 4 ఏళ్ల చిన్నారిని ప్రయాణించిన క్యాబ్‌లోనే మర్చిపోయిందని గ్రహించారు. తల్లిదండ్రులు వెంటనే 112కు కాల్ చేయగా, పోలీసులు డ్రైవర్‌ను గుర్తించి, క్యాబ్ వెనుక సీట్లో నిద్రిస్తున్న చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు చేర్చారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది, పిల్లలతో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

జర్నీ చేసి అలిసిపోయి రాత్రి ఇంటికి చేరుకున్న ఆ కుటుంబానికి కాసేపటి తర్వాత తమ చిన్నారి కనిపించలేదు. ఒక్క నిమిషం ఆలోచించాక.. తమ 4 ఏళ్ల చిన్నారి తాము ప్రయాణించిన క్యాబ్‌లోనే ఉండిపోయాడని వారికి గుర్తొచ్చింది. తర్వాత బాబు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలియక ఆ తల్లిదండ్రులు చెప్పలేని నరకం అనుభవించారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు సామాన్లు మర్చిపోవడం, ఫోన్లు వదిలేయడం చూస్తుంటాం.. కానీ బెంగళూరులో ఓ కుటుంబం తమ 4 ఏళ్ల కుమారుడినే క్యాబ్‌లో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటికే నిద్రలోకి జారుకున్న ఆ 4 ఏళ్ల చిన్నారి కారు వెనుక సీట్లో గంటల తరబడి నిద్రపోయాడు. అపార్ట్‌మెంట్ చేరుకున్నాక..తమతో బాటే వెనక డోర్ నుంచి బాబు దిగాడనే ఉద్దేశంతో లగేజ్ తీసుకుని దంపతులు ఇంటిలోకి వెళ్లిపోయారు. అటు డ్రైవర్ సైతం.. బాబు దిగాడనే భ్రమలో వెనుక సీటు గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న కాసేపటికి బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఇల్లంతా వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో.. తాము క్యాబ్‌లోనే బాబును వదిలేశామని గ్రహించి లబోదిబోమన్నారు. వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ ‘112’కు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు క్యాబ్ నంబర్, డ్రైవర్ వివరాలను ట్రాక్ చేశారు. డ్రైవర్‌కు ఫోన్ చేసి.. కారు వెనుక సీట్లో పిల్లాడు నిద్ర పోతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అప్పటి వరకు తన కారులో ఒక చిన్నారి ఉన్నాడన్న విషయం డ్రైవర్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. వెంటనే కారును వెనక్కి తిప్పాలని డ్రైవర్‌ను ఆదేశించిన పోలీసులు.. అపార్ట్‌మెంట్ వద్దకు పిల్లాడిని సురక్షితంగా తీసుకువచ్చేలా చూశారు. గంట తర్వాత తమ కళ్లముందే బాబును చూసిన తల్లిదండ్రులు సంతోషంతో పోలీసులకు థ్యాంక్స్‌ చెప్పారు. తర్వాత పోలీసులు ఆ కుటుంబానికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వాహనం దిగేముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “వస్తువులను మర్చిపోతే పర్లేదు కానీ పిల్లాడిని ఎలా మర్చిపోతారు?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రి పూట అన్నం తినడం మంచిదా.. రోటీ మంచిదా ??

పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..

రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా

విద్యార్థులపై హెడ్ మాస్టర్ ప్రతాపం.. విచక్షణ లేకుండా అలా ఎలా చేశారు సర్

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

Follow Us