అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
ఫ్లోరిడా అడవుల్లో విపరీతంగా పెరిగిన కొండచిలువలు పర్యావరణానికి ముప్పుగా మారడంతో అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. సెన్సార్లు అమర్చిన రోబో కుందేళ్ల సహాయంతో వాటి కదలికలను గుర్తించి భారీ సంఖ్యలో కొండచిలువలను పట్టుకుంటున్నారు. రేడియో ట్రాన్స్‌మిటర్లతో మగ కొండచిలువలను ట్రాక్ చేస్తూ వేలాది గుడ్ల వ్యాప్తిని అడ్డుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొండచిలువల సంఖ్య విపరీతంగా పెరిగింది. పన్నెండేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. కుందేళ్ళతో పాటు జింకలు, అడవి పిల్లులను ఆహారంగా చేసుకునేని. క్రమంగా వీటి సంతతి పెరిగింది. దీంతో అడవిలో పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింది. ఫ్లోరిడా అడవుల్లో పెరిగిన కొండచిలువలు కారణంగా అనేక జీవజాతులు అంతరించాయి. పర్యావరణానికీ అవి ప్రమాదకరంగా మారాయి. పర్యావరణవేత్తలు దీనిని గమనించి ప్రభుత్వానికి సూచనలను చేసారు. కొండచిలువలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. సమస్యకు పరిష్కారంగా రోబో రాబిట్స్ ను రంగంలోకి దించింది. కుందేళ్ళ కు సెన్సార్లను అమర్చి.. వాటిని థర్మల్ కెమెరాలకు అనుసంధానించి రాత్రి సమయాల్లో కొండచిలువలు ఎక్కడ తిరుగుతున్నాయో గుర్తించారు. కొన్ని కొండచిలువలు రోబో రాబిట్స్‌ను మింగేసినా వాటి కున్న సెన్సార్ ను స్నేక్ క్యాచర్లు ట్రేస్ చేసి కొండచిలువలను పట్టుకున్నారు. ఫ్లోరిడా అడవుల్లో పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో వీటిని బంధించారు. తాజాగా ఈ వేటలో ఓ శాస్త్రవేత్తల సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 4 టన్నుల బరువున్న కొండచిలువను పట్టుకుంది. 2013లో పైథాన్ ట్రాకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి, ఇంత భారీ స్థాయిలో కొండచిలువలని పట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయం వెనుక శాస్త్రవేత్తలు అనుసరించిన వినూత్న వ్యూహం ఉంది. ‘స్కాట్ స్నేక్స్’ పేరుతో 40 మగ కొండచిలువలకి రేడియో ట్రాన్స్‌మిటర్లను అమర్చి వాటిని అడవిలోకి వదిలారు. అవి జతకట్టే క్రమంలో ఆడ కొండచిలువల చెంతకు వెళ్లినప్పుడు, ఆ సంకేతాల ఆధారంగా అధికారులు వాటి ఆచూకీని గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న భారీ ఆడ కొండచిలువలని పట్టుకోగలిగారు. దీని వల్ల సుమారు 4,100 కొండచిలువ గుడ్లు పర్యావరణంలో కలవకుండా నిరోధించగలిగారు. ఈ సీజన్‌లో పట్టుబడిన వాటిలో అత్యంత భారీ కొండచిలువ 17 అడుగుల పొడవు, 153 పౌండ్ల బరువు ఉంది. ఈ వినూత్న పద్ధతి వల్ల ఫ్లోరిడా అడవి తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
