వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
భారత్‌లో అత్యంత అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలుడి ఎడమ కంటి పైభాగంలోని గుంతలో పూర్తిగా పెరిగిన పన్నును వైద్యులు గుర్తించారు. నొప్పిలేని వాపుతో ఆసుపత్రికి వెళ్లిన బాలుడికి సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. నోటికి వెలుపల ఇతర భాగాల్లో పళ్లు పెరగడాన్ని ఎక్టోపిక్ టూత్ అంటారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి పన్నును తొలగించడంతో బాలుడు కోలుకున్నాడు.
వైద్య శాస్త్రానికే సవాలు విసిరే అత్యంత అరుదైన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. ఓ 16 ఏళ్ల బాలుడి కంటలో పూర్తిగా పెరిగిన పన్నును గుర్తించి వైద్యులు నివ్వెరపోయారు. జాతీయ మీడియా పోస్ట్ కథనం ప్రకారం.. ఈ బాలుడు తన ఎడమ కంటి పైభాగంలో నొప్పిలేని వాపుతో ఆసుపత్రికి వెళ్లాడు. మొదట సాధారణ గడ్డగా భావించినప్పటికీ, కొన్ని రోజుల్లోనే కనురెప్ప, కనుబొమ మధ్య చర్మం నుంచి రెండు తెల్లటి గట్టి మొనలు బయటకు రావడం చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులు చూసి నిర్ఘాంతపోయారు. బాలుడి కంటి పైభాగంలోని గుంతలో ఒక పన్ను పూర్తిగా పెరిగినట్లు తేలింది. నోటిలో కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో పళ్ళు పెరగడాన్ని వైద్య పరిభాషలో ‘ఎక్టోపిక్ టూత్’ అంటారు. ముక్కులో లేదా అంగిలిలో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయిగానీ, కంటి గుంతలో పన్ను పెరగడం మాత్రం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి నిపుణులు స్పష్టం చేశారు. కంటి పైభాగంలోని సుపీరియర్ ఆర్బిట్‌లో ఎక్టోపిక్ టూత్ కేసు నమోదవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని అద్యయనకారులు వివరించారు. బాలుడికి ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేదా ముఖానికి గాయాలైన చరిత్ర లేదని తేల్చారు. అనంతరం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ పన్నును తొలగించారు. దీంతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమలాపురంలో అరుదైన వేలం.. అమ్మవారి మెడలో దండ వేయాలంటే..
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్ డిమాండ్
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్ పరిస్థితేంటి?
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..