Viral Video: గర్భవతైన కూతుర్ని.. ఆటోతో తొక్కించబోయిన కన్న తండ్రి.! హృదయాల్ని కదిలిస్తున్న వీడియో..

Updated on: Aug 15, 2022 | 9:02 PM

రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్‌లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది.


రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్‌లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు. ఇక ఈ మధ్యే గర్భవతి అయిన ఆమెను భరత్ పూర్‌కు తీసుకొచ్చాడు నరేంద్ర. ఈ క్రమంలో రోటిన్ చెకప్‌లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో నగ్మా తండ్రి ఆటోతో ఇద్దరిని గుద్దేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన నరేంద్ర, నగ్మాలు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇక వెంటనే స్థానికులు అక్కడంతా గుమిగూడటంతో అక్కడి నుంచి జంప్‌ అయ్యాడు నగ్రా తండ్రి. ఇందుకు సంబంధించిన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 15, 2022 09:02 PM