మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ

Updated on: Apr 14, 2026 | 10:35 AM

అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని, మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టిన VIPS సంస్థ మరో భారీ దగాకు సిద్ధమై పోలీసులకు చిక్కింది. గతంలో పూణే కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ, అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో పెట్టుబడిదారుల నుండి సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ముఖం చాటేసింది. ఈ అక్రమ నగదు బదిలీపై 2023లోనే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

తాజాగా, ఈ సంస్థ డైరెక్టర్లు తమ పంథాను మార్చి ‘WAWE’ అనే కొత్త పేరుతో రంగంలోకి దిగారు. నల్గొండ పట్టణంలో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి, మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ సమావేశంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సంస్థకు చెందిన పదిమంది డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ చేసే నమ్మకద్రోహపు మాటలను నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అపరిచిత సంస్థలు ఇచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానాస్పద కార్యక్రమాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

Follow Us