దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్‌ వీడియో

Updated on: Oct 04, 2022 | 9:06 AM

ఓ మహిళ తొందరపాటులో వేసిన ఓ కేక రెస్టారెంట్‌లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఉదంతం బ్రెజిల్‌లో సంభవించింది. బ్రెజిల్‌లోని రెసిఫ్‌ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ రెస్టారంట్‌ కస్టమర్లతో కిటకిటలాడుతోంది.

ఓ మహిళ తొందరపాటులో వేసిన ఓ కేక రెస్టారెంట్‌లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఉదంతం బ్రెజిల్‌లో సంభవించింది. బ్రెజిల్‌లోని రెసిఫ్‌ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ రెస్టారంట్‌ కస్టమర్లతో కిటకిటలాడుతోంది. అంతలోనే స్థానికంగా ఓ జిమ్‌కు చెందిన బృందం వారి మధ్యలోంచి పరుగులు పెడుతూ.. ముందుకు సాగింది. అందులో ఒక మహిళ.. ఎవరో ఛేజ్‌ చేస్తున్నట్లు వెనక్కు తిరిగి చూసింది. అంతలోనే ఎవరో చోరీ జరిగిందని అరిచారు. అంతే..! దొంగలు దొంగలు అనేసరికి.. మిగతా వారూ తమ వస్తువులను అక్కడే టేబుల్స్‌పై వదిలేసి పారిపోయారు. భయాందోళలనకు గురై.. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగందుకున్నారు. ఈ గందరగోళం కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, చిన్నపాటి అపార్థంతో ఇదంతా జరిగిందని రెస్టారెంట్‌ నిర్వహకులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం

 

Published on: Oct 04, 2022 09:06 AM
Loading...
Unable to load recommendations.
Follow Us