ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్ వేస్తారట !! ఎక్కడ అంటే ??
మీకు తెలుసా ఓ గ్రామంలో అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించరట. పైగా అక్కడ ఓటు వెయ్యనివారికి ఫైన్ విధిస్తారట. విచిత్రంగా ఉందికదూ.. కానీ ఇది నిజం.
మీకు తెలుసా ఓ గ్రామంలో అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించరట. పైగా అక్కడ ఓటు వెయ్యనివారికి ఫైన్ విధిస్తారట. విచిత్రంగా ఉందికదూ.. కానీ ఇది నిజం. ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల ప్రచార హోరు. అభ్యర్థుల ప్రచార జోరు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు. కార్యకర్తల హంగామా. అయితే ఇవన్నీ ఆ ఊర్లో కనబడవు. ఎన్నికల సందర్భంగా ఆ గ్రామంలో రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు. అలాగని వారు ఎన్నికలకు వ్యతిరేకమేమీ కాదు.. ఊర్లో ఓటు హక్కున్నవారంతా తప్పనిసరిగా ఓటెయ్యాల్సిందే. లేదంటే జరిమానా కట్టాల్సిందే. దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తోంది గుజరాత్‌లోని రాజ్‌సమధియాల గ్రామం. రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమధియాల గ్రామంలో ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు. 1983 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా ఓటు వేయకపోతే వారు 51 రూపాయలు జరిమానా చెల్లించాల్సిందేనని సర్పంచ్ తెలిపారు. అంతేకాదు తమ ఊర్లో ఏ ఇంటికి తాళాలు కనిపించవని, ప్రజలెవరూ తమ ఇళ్లకు తాళాలు వేయరని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??
Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!
లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!