ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి భయంతో పరుగు

Updated on: Sep 29, 2026 | 10:15 PM

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో ఓ హెయిర్‌ సెలూన్‌ ముందు గుర్తుతెలియని వ్యక్తులు పూజా సామగ్రి ఉంచడం కలకలం రేపింది. ఉదయాన్నే షాప్‌ తెరిచేందుకు వెళ్లిన యజమాని గణపతికి పెద్ద ముగ్గులతో పాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజు పెంకులు, దీపాలు కనిపించాయి. దీంతో ఆయన స్థానికులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి బాధ్యులను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో క్షుద్రపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది.ఉదయాన్నే షాప్ తెరిచేందుకు వెళ్లిన యజమానికి దుండగులు వేసిన పూజా సామగ్రిని చూసి భయాందోళనకు గురయ్యాడు. కురుపాం గ్రామానికి చెందిన గణపతి అనే వ్యక్తి స్థానికంగా హెయిర్ సెలూన్ నడుపుతున్నాడు. రోజూలాగే ఉదయాన్నే షాపు తెరిచేందుకు వెళ్లిన గణపతికి షాప్ ముందు భయానక దృశ్యం కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు షాప్ ముందే పెద్ద పెద్ద ముగ్గులు వేసి, అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజు పెంకులు, దీపాలు పెట్టి భయానక పూజలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన గణపతి, వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలియగానే షాప్ వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వ్యాపారంలో గిట్టని వారే ఎవరో ఇలా క్షుద్రపూజలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి వింత ఘటనలు పలుమార్లు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. వరుసగా ఇలాంటి పూజలు వెలుగుచూస్తుండటంతో కురుపాం గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి, సమీపంలోని సీసీ టీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లెట్‌ ట్రైన్‌లో టీమ్‌ ఇండియా.. ఆటగాళ్ల రియాక్షన్‌ చూస్తే

PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

Anant Ambani: ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం

ఏఐ ఎంత ప‌ని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్‌!

యూట్యూబర్ కొంపముంచిన రీల్స్‌.. ఏం జరిగిందో మీరే చూడండి!

Loading...
Unable to load recommendations.
Follow Us