గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే

|

Sep 03, 2022 | 9:47 AM

న్యూజెర్సీలోని ఒక పాఠశాలలో పాఠాలు చెబుతున్న మహిళా టీచర్‌ ధరించిన దుస్తులపై విద్యార్ధుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యూజెర్సీలోని ఒక పాఠశాలలో పాఠాలు చెబుతున్న మహిళా టీచర్‌ ధరించిన దుస్తులపై విద్యార్ధుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ టీచర్ ఒక ఉపాధ్యాయురాలిగా కాకుండా పదిమంది దృష్టిని ఆకర్షించేవిధంగా బట్టలు వేసుకుంటుందంటూ ఆమె ధరించిన దుస్తులపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా టీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్కూల్ ఫోటోలు పోస్ట్ చేయడం ‘చీప్ పాపులారిటీ’ కోసం చేస్తున్న స్టంట్ అని కూడా ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వార్త ప్రకారం, మహిళా టీచర్‌కు టాయ్‌బాక్స్ డాల్జ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉంది. అక్కడ ఆమె తన పాఠశాల ఫోటోలను షేర్ చేస్తుంది. టీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. ఆమె పోస్ట్‌లను వేలాది మంది ఇష్టపడుతున్నారు. అయితే విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ టీచర్‌ ధరించే దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి బట్టలు క్లబ్‌, పార్టీలకు వెళ్లినప్పుడు ధరిస్తారు .. పాఠశాలలో కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలపై మహిళా టీచర్ కూడా ఘాటుగా స్పందిస్తూ.. విద్యార్థులకు పాఠాలు బోధించడానికే తను క్లాస్‌కి వస్తానని, తానొక మంచి టీచర్‌నని చెప్పింది. అంతేకాదు తాను వేసుకునే దుస్తులు తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పింది. ఒక టీచర్‌గా తాను పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తానని, ద్వేషించేవాళ్లు ద్వేషిస్తూనే ఉంటారని వివరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

టికెట్లు క్యాన్సిల్‌ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!

భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

అందుకే విరాట్‌ Attitude నాకు నచ్చుతుంది

కోహ్లీ, పాండ్యాను కలిసిన ‘మారో ముఝే మారో’

Published on: Sep 03, 2022 09:46 AM