Pani Puri Ice Cream: ఇంకెన్ని దారుణాలు చూడాల్రా బాబూ.. పానీపూరి ఐస్ క్రీమ్ తో పేరుతో కుంభీపాకం..

Updated on: Mar 08, 2023 | 7:12 PM

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం అయిందంటే అలా రోడ్డుమీదకు వెళ్లి వేడి వేడి పకోడీనో, మిర్చి బజ్జీనో, లేదంటే పానీ పూరీనో తినాల్సిందే. ఇక పానీ పూరీ అంటే ఇష్టపడని వారుండరు.

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం అయిందంటే అలా రోడ్డుమీదకు వెళ్లి వేడి వేడి పకోడీనో, మిర్చి బజ్జీనో, లేదంటే పానీ పూరీనో తినాల్సిందే. ఇక పానీ పూరీ అంటే ఇష్టపడని వారుండరు. వీధి చివర ఉండే పానీపూరీ బండి వద్ద రద్దీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే… ఏ వంటకాన్నైనా సరే.. ఒకే పద్ధతిలో చేయాలి. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. గులాబ్ జామ్ పరోటా, క్యాడ్బరీ ఎగ్ ఆమ్లెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కుకింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పానీపూరి.. పేరు చెప్పగానే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నోరూరుతుంది. పూరీలో దాల్, నీరు నింపి ఇవ్వగానే నోట్లో వేసుకుని గుటుక్కుమనిపిస్తుంటారు. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఓ వీధివ్యాపారి పానీపూరి తయారు చేస్తున్నాడు. కానీ వాటిలో పానీ నింపకుండా ఐస్ క్రీమ్ నింపి ఇస్తున్నాడు. వెనిలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను పూరీలో యాడ్ చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. ఇంకా రుచి కోసం సిరప్ కూడా యాడ్ చేశాడు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 26 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన వారంతా షాపు యజమానిపై పైర్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని మండిపడుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 08, 2023 07:12 PM
Loading...
Unable to load recommendations.
Follow Us