ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

Updated on: Apr 22, 2025 | 5:08 PM

అడవి జంతువులను క్రూర మృగాలను పెంపుడు జంతువులుగా మార్చుకుని, వాటితో రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు పాకిస్తానీ కంటెంట్‌ క్రియేటర్‌ నౌమాన్‌ హసన్‌.. ఈ సారి మరో వైరల్ వీడియోతో వార్తల్లోకెక్కారు. ఈ అతను ఏకంగా ఓ పెద్ద పులిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్‌ నౌమాన్ హసన్ పులిని ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంత భయంకర అడవి జంతువు దగ్గరికి వెళ్ళడానికి అతనికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ చాలా మంది అడిగారు. వీడియోను దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీలను పోస్ట్‌ చేశారు. మరికొందరు ఆ వీడియోపై తీవ్ర విమర్శలు చేశారు. నౌమాన్ హసన్ గతంలో కూడా అడవి జంతువులతో పలు రకాల వీడియోలు తీసి విమర్శలను ఎదుర్కొన్నాడు. అతను ఒకసారి ఒక రద్దీ వీధిలో గొలుసులతో కట్టే ఉంచిన పులిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసాడు. అది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

Samantha: సమంత షాకింగ్‌ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..