వంట గ్యాస్‌ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ

Updated on: May 01, 2026 | 4:54 PM

ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రమైంది. పాకిస్థాన్‌లో గ్యాస్‌ సంక్షోభం తారస్థాయికి చేరింది. కరాచీ ప్రజలు ప్రాణాలకు తెగించి ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్‌ నింపుకుంటున్నారు. భద్రతా నిపుణులు వీటిని 'మొబైల్ బాంబులు'గా హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి నిప్పురవ్వ తగిలినా భారీ ప్రమాదం తప్పదని అధికారులు చెబుతున్నారు. ప్రజల భద్రత కోసం గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో నెలకొన్న ఇంధన కొరత ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పలు దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన కొరత భయంతో కొందరు ప్రమాదకర స్థితిలో ముడిచమురును నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వంటగ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో నెలకొన్న తీవ్రమైన ఇంధన కొరత కారణంగా, కరాచీ ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వింతైన, ప్రమాదకరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా మోమినాబాద్ ప్రాంత ప్రజలు గ్యాస్ సరఫరా లేక, భారీ ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్‌ను నింపుకుంటున్నారు. గ్యాస్ సరఫరా వచ్చే కొద్దిపాటి సమయంలోనే, ఈ ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్‌ను నింపుకుని ఇళ్లకు తరలిస్తున్నారు. కరాచీ మార్కెట్లలో ఈ గ్యాస్‌ బెలూన్లు రూ. 1000 నుంచి రూ.1500 ధరకు అమ్ముడవుతున్నాయి. ఈ పద్ధతి ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. భద్రతా నిపుణులు వీటిని ఏకంగా ‘మొబైల్ బాంబులు’ అని పిలుస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో ఒత్తిడికి లోనైన గ్యాస్, చిన్నపాటి నిప్పురవ్వ తగిలినా లేదా రాపిడికి గురైనా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉంది. మండుటెండల్లో వీటిని రవాణా చేయడం నిప్పుతో చెలగాటమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. తమ దైనందిన అవసరాల కోసం ప్రజలు చేస్తున్న ఈ ‘బెలూన్ సాహసం’ పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. తక్షణమే అధికారులు గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి, ప్రజలను ఈ ప్రమాదం నుంచి రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాకు ‘గుండెపోటు’ తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్!

దేశంలో వద్దనుకున్న వాటిని.. విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నాం.. ఆస్ట్రేలియాలోని భారతీయ మహిళ వైరల్

స్మార్ట్‌ఫోన్‌లకు చెక్ పెడుతున్న ‘టిన్ క్యాన్’

Rama Prabha: హీరో ఛాన్స్‌ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు

కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి

Follow Us